మేడపి గ్రామంలో కూలిన వందేలనాటి చెట్టు

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని మేడిపి గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి భారీ వేప చెట్టు అల్పపీడనం కారణంగా నేలకు కూలింది. ఈ వేప చెట్టు దాదాపుగా 100 ఏళ్ల నాటి నుండి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ చెట్టు నేలకొరికే సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ప్రాంతంలోని ప్రజలు ఆ చెట్టును మహాలక్ష్మిగా భావించి పూజలు కూడా చేస్తారు.

தொடர்புடைய செய்தி