కనిగిరి: బెల్ట్ షాపులను తనిఖీ చేసిన ఎస్ఐ

హనుమంతునిపాడు పోలీసు స్టేషన్ పరిధిలోని బెల్ట్ షాపులను కనిగిరి ఎస్సై మాధవరావు ఆదివారం తనిఖీ చేశారు. హనుమంతునిపాడు మండలంలోని రెడ్డివారిపల్లి, ఎలుక వారి పల్లి గ్రామాలలో పాత బెల్టు షాపులను ఎస్సై తన సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తామంటే ఊరుకోమని, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி