ఓ అంగన్వాడి కార్యకర్తపై ప్రజా దర్బార్ లో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిడిపిఓ శుక్రవారం విచారణ చేపట్టారు. వెలిగండ్ల మండలంలోని నరసరావు గ్రామ అంగన్వాడి కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్త సర్టిఫికెట్లను, వివిధ అంశాలను పరిశీలించినట్లుగా సిడిపిఓ సరోజిని తెలిపారు. నివేదికను ఉన్నత స్థాయి అధికారులకు సమర్పిస్తామని తెలిపారు. వీరి వెంట ప్రాజెక్టు కోఆర్డినేటర్ శామ్యూల్ పాల్గొన్నారు.