వెలుగొండ జలాల కోసం సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడుతున్నట్లుగా జిల్లా సిపిఐ కార్యదర్శి నారాయణ తెలిపారు. కనిగిరిలోని సిపిఐ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ 1996లో వెలుగొండ ప్రాజెక్టు కోసం ఉద్యమం చేస్తే అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారన్నారు. ఇప్పటికి 28 సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. నవంబర్ 18 వ తేదీ కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు.