ప్రకాశం జిల్లా కంభం మండలం దేవనగరం గ్రామంలో మద్యం బెల్టు షాపు నిర్వహిస్తున్న ఓ మహిళను ఎక్సైజ్ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మహిళ వద్ద నుంచి 10 క్వార్టర్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ సీఐ కొండారెడ్డి తెలిపారు. నిందితురాలిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కంభం సర్కిల్ పరిధిలో మద్యం బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.