దర్శి: దోర్నాపు వాగును పరిశీలించిన గొట్టిపాటి

4 రోజులుగా తాళ్లూరు మండలంలో భారీ వర్షాలు కురిసాయి. దీంతో విఠలాపురం తాళ్లూరు మధ్యలో ఉన్న దోర్నాపు వాగు వరదనీటితో పోటెత్తింది. ఉధృతంగా వాగు ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న దర్శి టిడిపి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి బుధవారం అధికారులతో కలిసి వాగును పరిశీలించారు. త్వరలో సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు.

தொடர்புடைய செய்தி