దర్శి మండలం పోతవరం పంచాయతీలోని తిమ్మాయపాలెం ఎస్టీ కాలనీలో విద్యుత్ స్తంభం విరిగిపడి విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా మారడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందారు. ఎస్టీ కాలనీలో విద్యుత్ సమస్య ఏర్పడిన విషయం సోమవారం తెలుసుకున్న టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి వెంటనే సమస్యకు పరిష్కారం చూపారు. విద్యుత్ అధికారులతో మాట్లాడి వెంటనే ఎస్టీ కాలనీలో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలని సూచించారు.