చిన్నారులకు విద్యతో పాటు నైతిక విలువలు పెంపొందించాలని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. ఎల్ కోట మండల కేంద్రంలో శ్రీహరి శర్మ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సుపద 21వ వార్షికోత్సవం అలాగే ప్రతిభ పరీక్షలు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సుపద ద్వారా ఆడపిల్లలకు సంస్కృతి సంప్రదాయాలు, మానవతా విలువల పరిరక్షణ, హిందూ దైవత్వాన్ని పెంపొందించడం లాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.