జీవో నెంబర్ 3 కు చట్ట భద్రత కల్పించాలని మంత్రి సంధ్యారాణికి గిరిజన జేఏసీ సంఘాల నాయకులు వినతిపత్రంన్ని ఆదివారం సాలూరు నివాస కార్యాలయంలో అందజేశారు. ఐటిడిఏ కార్యాలయ వివిధ విభాగాల్లో ఉద్యోగ స్థానాలు ఖాళీలను నింపాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ కచ్చితంగా కొన్ని రోజులలో కొత్త జీవోను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని, ప్రభుత్వంతో మాట్లాడి స్పెషల్ డీఎస్సీ నిర్వహించే దిశగా కృషి చేస్తామని చెప్పారు.