బంతి పూలకు భలే డిమాండ్ ఏర్పడింది. శనివారం పార్వతీపురం వారపు సంతలో కేవలం పది కిలోలు బరువుండే బుట్టడు బంతి పూలు రూ. 200 నుంచి రూ. 250లకు వర్తకులు కొనుగోలు చేశారు. దీంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాడేరు, హుకుంపేట, జి. మాడుగుల మండలాలకు చెందిన గిరిజన రైతులు ప్రతి ఏడాది బంతి పువ్వులను సాగు చేస్తుంటారు.