దీపావళి బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి: ఎస్పీ సతీశ్

రానున్న దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా తయారీ కేంద్రాలు, నిల్వ చేసే గోడౌన్లు, విక్రయించే దుకాణాలకు తప్పనిసరిగా అనుమతి ఉండాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఎస్పీ తన కార్యాలయంలో మాట్లాడారు. బాణాసంచా తయారీ, విక్రయాలు చేసే వారు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி