మైనర్ బాలిక అదృశ్యంపై కేసు నమోదు

మైనర్ బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఉండ్రాజవరం ఎస్సై గుబ్బల శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. వివరాల ప్రకారం ఉండ్రాజవరం మండలం మోర్తకు చెందిన బాలిక(16) తణుకులోని ఓ ఆసుపత్రిలో పని చేస్తోందన్నారు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. స్నేహితులు, బంధువులు ఇంటి వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె తల్లి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி