వరద బాధితులకు బియ్యం వితరణ

విజయవాడ వరద బాధితులకు గోపాలపురం మండలంలోని, చిట్యాల గ్రామ జనసైనికులు అండగా నిలిచారు. వరద బాధితుల సహాయార్థం తమ వంతుగా ఒక టన్ను బియ్యాన్ని సేకరించి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజుకు మంగళవారం అందించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఒకరికొకరు తోడు నిలవాలన్నారు.

தொடர்புடைய செய்தி