రాజంపేట మండలం శవన వారి పల్లి గ్రామస్తులు తమ గ్రామానికి త్రాగు నీరు కావాలని జిల్లా పరిషత్ చైర్మన్ అకేపాటి అమర్ నాథ్ రెడ్డి గారికి విన్నపించారు. తమ గ్రామానికి త్రాగునీరు లేవని ఉన్న బోరు ఇంకిపోవడంతో నీళ్లు రావట్లేదని జిల్లా పరిషత్ చైర్మన్ ఆగేపాటి అమర్ నాథ్ రెడ్డి గారికి మరియు సోదరుడు ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి గారికి విన్నవించగా వాళ్లు వెంటనే స్పందించి మీ గ్రామానికి రెండు మూడు రోజుల్లో కొత్త బోరు, మోటర్ తెపించే బాధ్యత నాది అని జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజంపేట మండల ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజేష్ నాయక్, రాజంపేట జెడ్పీటీసీ దాసరి పెంచలయ్య శవన వారి పల్లి గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.