నరసాపురం మండలం లింగబోయినచర్లలోని డా. బీఆర్. అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలను కలెక్టర్ నాగరాణి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాల, ల్యాబ్లను, పరిసరాలను పరిశీలించారు. పాఠశాలలో తాగునీటి సమస్య ఉందని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి ఒక ఓవర్ హెడ్ ట్యాంకు, బోర్ వెల్ ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేయాలన్నారు.