పూతలపట్టు: కార్యకర్తలకు అండగా ఉంటాం: మాజీ ఎమ్మెల్యే సునీల్

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆదివారం భరోసా ఇచ్చారు. అక్రమ కేసులను అరికట్టాలని ఎస్పీ, డీఎస్పీ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేసినట్టు ఆయన చెప్పారు. అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే నిరసనలు చేపడతామన్నారు.

தொடர்புடைய செய்தி