అర్హులైన ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు చేసుకోవాలని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ సూచించారు. మంగళవారం తాడికొండ మండలంలో ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల నమోదు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవంబర్ 6లోపు ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్య క్రమంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.