మాచవరం: ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా వైద్యాధికారి

మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పల్నాడు జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులను వారికి అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆశా వర్కర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో డయేరియా సోకకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி