గ్రామాల అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ కేస్ లక్ష్మణరావు తెలిపారు. పాత గుంటూరు సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు నిధులు ఇచ్చేందుకు ఆర్థిక సంఘం ఏర్పాటు చేశారని చెప్పారు. అయితే ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.