ప్రతి వైసీపీ కార్యకర్త కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఎండగట్టాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ నూరి పాతిమా పేర్కొన్నారు. ఆదివారం గుంటూరులో వైసీపీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు డైమండ్ బాబు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.