మైదుకూరు: తాగునీటి సమస్యను పరిష్కరించండి

మండల కేంద్రమైన బ్రహ్మంగారిమఠంలో గల జింకల నగర్ లో ఉన్న వాటర్ ట్యాంక్ కు నీరు నింపడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు నీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం సిపిఎం మండల కమిటీ సభ్యులు గండి సునీల్ కుమార్ వాటర్ ట్యాంక్ వద్ద గ్రామస్తులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సమస్య పట్ల గ్రామ ప్రజలు అనేక మార్లు అధికారులకు తెలిపినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.

தொடர்புடைய செய்தி