అనంతపురంలోని రాజేంద్ర మునిసిపల్ స్కూలులో జిల్లా వైద్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో.. మంగళవారం నిర్వహించిన రాష్ట్రీయ బాల స్వాస్థ -జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థి దశలో నులిపురుగుల ప్రభావం వలన రక్త హీనత ఉంటుందన్నారు. ఇటువంటి సమస్యల నుంచి బయట పడాలంటే విద్యార్థులు ఆల్బెండజోల్ మందులు వాడాలన్నారు.