విజయవాడ వరద బాధితులకు సహాయం చేయడానికి యలమంచిలి మున్సిపాలిటి కొక్కిరాపల్లి గ్రామనికి చెందిన గ్రామ జ్యోతి యువత సంస్థ ముందుకు వచ్చింది. సంస్థ ఆధ్వర్యంలో.. యలమంచిలి పట్టణ షాప్ యాజమాన్యులనుండి కొక్కిరాపల్లి గ్రామ ప్రజలు, బంధుమిత్రులు సేకరించిన 73,270 రూపాయలను ఎమ్మెల్యే విజయకుమార్ సూచన మేరకు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణాన్ కి అందచేశారు. విరాళాలు సేకరించి యువకులను కలెక్టర్ అభినందించారు.