కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నందుకు నిరసనగా ఈనెల 26న అనకాపల్లిలో జరిగే ప్రదర్శనను విజయవంతం చేయాలని సీఐటీయూ పిలుపునిచ్చింది. ఆదివారం సీఐటీయూ యలమంచిలి మండలం కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్. శంకరరావు, మండల కార్యదర్శి శివాజీ మాట్లాడుతూ.. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. లేబర్ కోడ్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.