దేవీపట్నం: విహారయాత్రకు 400 మంది పర్యాటకులు

దేవీపట్నం మండలం నుంచి పాపికొండలు విహారయాత్రకు పర్యాటకులు భారీగా వెళ్లి వచ్చారని టూరిజం శాఖ అధికారి సాంబశివరావు తెలిపారు. ఆదివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి ఆలయం వద్ద నుంచి గోదావరి నదిలో ఏడు పర్యాటక బోట్లలో 400 మంది పర్యాటకులు వెళ్లినట్లు చెప్పారు. వీరందరికీ లైఫ్ జాకెట్లు ఇవ్వడం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி