పరవాడ, అచ్యుతాపురం మండలాల్లో గల ఫార్మా పరిశ్రమలు నీటి సమస్యతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు అనకాపల్లి జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం పరవాడలో ఆయన మాట్లాడుతూ నీటి కొరత కారణంగా పరిశ్రమల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందన్నారు. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే పరిశ్రమంలో మూతపడతాయన్నారు.