విశాఖ: సొంతనిధుల‌తోనే పోర్టు ఆస్ప‌త్రిని అభివృద్ధి చేయాలి

పోర్టు ఆసుపత్రిని సంస్థ సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలనీ పోర్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ ట్రెజరర్‌ కోన మంగయ్య నాయుడు డిమాండ్‌ చేశారు. పోర్టు ఆసుపత్రి ప్రైవేటీ కరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన రిలే నిరాహారదీక్షలు మంగళవారం నాటికి 29వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోర్టు ఆసుపత్రి ప్రయివేటీకరణ జరగకుండా యాజమాన్యం చొరవ చూపాలని కోరారు.

தொடர்புடைய செய்தி