విశాఖ జూ క్యురేట‌ర్‌కు బ‌దిలీ

విశాఖ జూ క్యురేట‌ర్ నంద‌నీ స‌లారియాకు బ‌దిలీ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐఎఫ్ఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ చేసింది. విశాఖ జూ క్యురేట‌ర్‌ను ఏపీ ఎంఎస్ఎంఈ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్‌గా బ‌దిలీ చేసింది. నంద‌నీ స‌లారియా 2020 నుంచి విశాఖ జూ క్యురేట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఆమె హ‌యాంలో జూ ఎన‌లేని అభివృద్ధి సాధించింది.

தொடர்புடைய செய்தி