ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీన జరుపుకునే ప్రపంచవ్యాప్తంగా రోజ్‌డేకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై మరింతగా అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. క్యాన్సర్ రోగులకు అంకితం చేసిన ఈ రోజున క్యాన్సర్ బాధితులకు గులాబీలను అందజేసి, వారిలో మానసిక ధైర్యాన్ని కల్పిస్తారు. కెనడాకు చెందిన మెలిండా అనే 12 ఏళ్ల బాలిక జ్ఞాపకార్థం ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు.