TG: పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్ వినిమయ వస్తువులు, విడిభాగాలు అందించే ‘అంబర్- రెసోజెట్ భాగస్వామ్య సంస్థ రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులతో ఉత్పాదన ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. సోమవారం నాడు ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో సంస్థ ప్రతినిధులు తమ పెట్టుబడుల ప్రణాళికను వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో రూ.250 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొల్పుతుందని శ్రీధర్ బాబు చెప్పారు. దీని వల్ల ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు.