ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

73பார்த்தது
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ  ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీను కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జన చైతన్య యాత్రలో భాగంగా ఆదివారం సూర్యాపేట నుండి కోదాడకు చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈనెల 27వ తారీకున హైదరాబాద్ లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మజాహర్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி