కోదాడ పట్టణానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు ఆలూరి నాగరాణి సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆమె గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలుగా కోదాడ మండలంలోని తొగరాయి, చిలుకూరు మండలంలోని కొండాపురం గ్రామాల్లో పనిచేశారు. ఆమె మృతి పట్ల కోదాడ ఏంఈఓ సలీం షరీఫ్, పలు ఉపాధ్యాయ సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి.