రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. ఆదివారం కోదాడ మండలం నల్లబండగూడెంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. అధికారులు రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చందర్రావు, ఆర్డీవో సూర్యనారాయణ ఉన్నారు.