పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని రైతులు తమ వరి కోతలను వాయిదా వేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రాజ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాబోవు ౩-4 రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు కోతలు మొదలు పెడితే నష్టపోయే ప్రమాదం ఉందని, ఇప్పటికే పంటను కోసిన రైతులు పొలం వద్దనే తమ ధాన్యాన్ని టార్పాలిన్ కవర్లతో కప్పుకొని తడవకుండా జాగర్త చేసుకోవాలన్నారు.