సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం, పట్టణంలో ఈ నెల 24న తిరుమల గార్డెన్ లో చేపట్టనున్న మెగా జాబ్ మేళ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ చిగురుమామిడి మండలం సోషల్ మీడియా కన్వీనర్ బోయిని వేణుగోపాల్ ఆదివారం కోరారు. వేణుగోపాల్ మాట్లాడుతూ రవాణాశాఖ బిసి సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళను నిరుద్యోగ యువతి యువకులు వినియోగించుకోవాలని తెలియజేశారు.