ప్రజాపాలన విజయోత్సవాలకు రేవంత్ సర్కార్ పిలుపునిచ్చింది. డిసెంబరు 1 నుంచి 9 వరకు రాష్ట్రమంతటా ఈ విజయోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో టీజీపీఎస్సీ గ్రూప్ 4 తుది ఫలితాల్లో ఉద్యోగాలు సాధించిన వారికి సీఎం రేవంత్ తీపి కబురు చెప్పారు. విజయోత్సవాల్లో భాగంగా డిసెంబరు 4న పెద్దపల్లి జిల్లాలో నిర్వహించనున్న సభలో, ఉద్యోగాలకు ఎంపికైన 9 వేల మంది గ్రూప్ 4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నారు.