హైదరాబాద్: నరేందర్ రెడ్డి, రైతులను వెంటనే విడుదల చేయాలి: కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. నరేందర్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ Xలో ట్వీట్ చేశారు. సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్కు ఆపాదించే కుట్ర జరుగుతోందన్నారు. అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుందన్నారు. వెంటనే ఆయనను, లగచర్లలో అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.