ఎల్బీనగర్: ఖబ్రస్థాన్ అభివృద్ధికి కృషి
హయత్ నగర్ ఖబ్రస్థాన్ ను ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేస్తామని కార్పొరేటర్ కళ్లెం నవజీ వన్ రెడ్డి తెలిపారు. డివిజన్ పరిధిలోని ఖబ్రస్థాన్ ను సోమవారం ఆయన ముస్లిం నాయకులతో కలిసి పరిశీలించారు. బోరు లేక నీటికి, విద్యుత్ లేకపోవడంతో రాత్రి సమయంలో ఇబ్బందుల తలెత్తుతున్నాయని ధ్వంసమైన ప్రహరీ స్థానంలో నూతనంగా నిర్మించాలని కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు.