ప్రజా సంక్షేమం, మున్సిపాలిటీ అభివృద్ధే ప్రధాన లక్ష్యమని ఆదిబట్ల చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పురపాలికను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని పేర్కొన్నారు. ఆదిభట్ల మున్సిపాలిటీ లోని 15వ వార్డులో 30 లక్షలు, 9వ వార్డు మమ్మరాజుగూడలో 5 లక్షలు, 11వ వార్డు బొంగ్లూర్ దర్గా దగ్గర 10 లక్షలు, 1వ వార్డులో 5 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణ పనులు ఆయన ప్రారంభించారు.