భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రాజ్‌భవన్ బయలుదేరి వెళ్లారు. ఎయిర్‌పోర్టులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు స్వాగతం పలికారు. రాజ్‌భవన్‌లో కాసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో వైభవంగా జరుగుతున్న కోటి దీపోత్సవానికి రాష్ట్రపతి హాజరుకానున్నారు.