కుబీర్: ఘనంగా ముగిసిన తాళ సప్తమి వేడుకలు
కుబీర్ మండలం పార్డి (కె) గ్రామంలోని దక్షిణముఖి హనుమాన్ ఆలయంలో ఏడు రోజులుగా కొనసాగుతున్న తాళ సప్తమి వేడుకలు బుధవారం ఘనంగా ముగిశాయి. వేడుకల ముగింపు సందర్భంగా హనుమాన్ విగ్రహానికి గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భాజా భజంత్రీల మధ్య దిండి ఊరేగింపు సాగింది. అనంతరం కాలకీర్తన కార్యక్రమం నిర్వహించారు. అంతరం భక్తులకు ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.