ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం రాత్రి లోకేశ్వరం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ అశోక్ వివరాల ప్రకారం మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో అర్చకులు రోజువారి లాగే పూజలు నిర్వహించి, ఆలయానికి తాళం వేసి వెళ్లారు. అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు తాళాన్ని పగలగొట్టి సూమారు 11 గ్రాముల బంగారం, 15 గ్రాముల వెండి ఆభరణాలు అపహరించినట్లు తెలిపారు.