కుంటాల మండల కేంద్రం శివారులో శుక్రవారం మళ్లి పులి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది నీటిపారుదల ప్రాజెక్టు కాలువ వద్ద పులిని చూసినట్లు తెలిపారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఎఫ్ఆర్ఓ వేణుగోపాల్, డిఆర్ఓ రేష్మ, ఎఫ్బిఓ హరిలత పులి పాదముద్రలను సేకరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తమ గ్రామ సమీపంలోని అడవుల్లో పులి ఉండడంతో భయంతో జీవిస్తున్నామని స్థానికులు తెలిపారు.