గజిటెడ్ హెచ్ఎం రాష్ట్ర కౌన్సిలర్ గా మండల కేంద్రమైన బాసరలోని ఉర్దూ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. మైసాజి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవలే జిల్లా కేంద్రంలో జరిగిన గజిటెడ్ హెచ్ఎం సంఘం సమావేశంలో కౌన్సిలర్ గా ఎన్నుకున్నారు. 2026 వరకు ఇతర పదాధికారులతోపాటు మైసాజి కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిజిహెచ్ఎంల సమస్యల పరిష్కారానికి సంఘం కృషి చేస్తుందని వెల్లడించారు.