నల్గొండ జిల్లా నిడమనూరు మండలం రాజన్న గూడెం గ్రామంలో వెనిగండ్ల పిఏసిఎస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు.