మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో గర్భస్థ శిశువు మృతి
కాన్పునకు తీసుకువస్తే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, గర్భస్థ శిశువు మృతిచెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. అంజనపల్లి గ్రామానికి చెందిన మౌనిక అనే గర్భిణికి నెలలు నిండడంతో ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణి పట్ల ఆస్పత్రి వైద్యసిబ్బంది నిర్లక్షంగా వ్యవహరించారని, గర్భస్థ శిశువు మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళనకు దిగారు