ప్రజా సమస్యలు పట్టించుకోని రేవంత్ ప్రభుత్వం
ప్రజా సమస్యలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడంలేదని బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కందిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను మంగళవారం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.