సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో కొంత మంది వ్యక్తులు ప్రభుత్వంచే నిషేదించిన మూడు ముక్కలాట (పేకాట) ఆడుతున్నారని సమాచారం అందిన వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసు బృందాలు పేకాట ఆడుతున్న ఆరు మంది వ్యక్తులను ఆదివారం అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ. 91,270 మరియు పేకాటకు వినియోగించిన కార్డ్స్ సీజ్ చేసి, తదుపరి విచారణకై పటాన్ చెరు పోలీసు స్టేషన్ కు తరలించారు.