సంగారెడ్డి మున్సిపల్ అధికారులు పచ్చదన కార్యక్రమాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పంపిణీ చేయాల్సిన మొక్కలను రాజీవ్ పార్కులో మూలకు వృధాగా పడవేశారు. 500 కు పైగా మొక్కలు పడేయడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొక్కలను ఇంటింటికి పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.