మెదక్: దీక్షను విరమింపజేసిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు
మెదక్ జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేసినటువంటి వికలాంగులకు బీసీ సంక్షేమ సంఘం తరఫున జిల్లా అధ్యక్షుడు నోముల శ్రీకాంత్ నిమ్మరసం ఇచ్చి మొదటి రోజు దీక్షను గురువారం విరమింపజేశారు. తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు వేల రూపాయలు పెంచి వెంటనే మంజూరు చేయాలని, ఉచిత బస్సు ప్రయాణానికి బస్ పాసులు ఇవ్వాలని, ఎలక్ట్రికల్ వాహనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.